ఏపీ తుపాను బాధితులకు ఆర్థిక సహాయం.. ప్రకటించిన ప్రభుత్వం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-29 09:28:38  IST  )

ఏపీలో మొంథా తుపాను బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ తుపాను బాధితులకు ఆర్థిక సహాయం.. ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మొంథా తుపాను బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పునరావాస కేందద్రాల్లో ఉన్న తుపాను బాధితులు ఒక్కొక్కరికి రూ.1000 ఆర్థిక సహాయం చేయాలని పేర్కొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3 వేలు ఇవ్వాలని, పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే ముందు ఈ ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

READ MORE .....

బాధిత రైతులకు తక్షణ సహాయం అందజేయాలి

Next Story