- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే ఏపీ DSC పరీక్షలు...ఈ రూల్స్ పాటించాల్సిందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DSC అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెగా డీఎస్సీ పరీక్షలు ( Mega DSC

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DSC అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెగా డీఎస్సీ పరీక్షలు ( Mega DSC exams) ప్రారంభం కాబోతున్నాయి. ఈ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ డీఎస్సీ పరీక్షలు కొనసాగుతాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఇవాల్టి నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 154 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. ఆ సమయంలోపు రాకపోతే పరీక్షకు అనుమతించబోరు. ఒక్క నిమిషం లేట్ అయినా సరే... నో ఎంట్రీ అని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే రెండు ఫోటోలు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ లో తప్పులు ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి... లాంటి గుర్తింపు కార్డులు తీసుకువెళ్లొచ్చు. ఈ సూచనలు పటిస్తూ పరీక్షలు రాయాలని... అధికారులు ఆదేశించారు. ఇక రెండు చేతులు లేని దివ్యాంగులు, దృష్టిలోపం ఉన్నవారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. 5.7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మూడు లక్షలకు పైగా అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.






