మేం మా ఇల్లు ఉన్న తెలంగాణకు వెళ్లకూడదా: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-03 12:56:34  IST  )

తెలంగాణలో తన ఇల్లు ఉందని, తాను అక్కడికి వెళ్లకూడదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలకాలంలో తెలంగాణలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. ..

మేం మా ఇల్లు ఉన్న తెలంగాణకు వెళ్లకూడదా: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో తన ఇల్లు ఉందని, తాను అక్కడికి వెళ్లకూడదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రశ్నించారు. అమరావతి(Amaravati)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలకాలం తెలంగాణలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర(Maharashtra), తమిళనాడు(Tamilanadu)కు వెళ్లినా తనకు ఎక్కడా ఇబ్బందులు కలగలేదన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandi), ప్రియాంక వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా అని ప్రశ్నించారు. కాంగ్రెస్(Congress) నుంచి వైసీపీ నేతలే ఇందిరా గాంధీ విగ్రహాన్ని కూల్చారని ఆయన గుర్తు చేశారు.

రేవంత్‌కి తెలుసనుకోవడం లేదు..

తెలంగాణలో జరిగిన ఘటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందని తాను అనుకోవడం లేదని పవన్ తెలిపారు. కాంగ్రెస్ వల్లే దేశంలో అవాంచనీయ ధోరణులు జరుగుతున్నాయన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలం శూన్యమైపోయిందని విమర్శించారు. దేశంలో నచ్చిన చోట బతకొచ్చని, అది వారి హక్కు అని, కాలరాసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. కశ్మీరీ పండిట్లను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొడితే ఏమైందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 2014-2024 వరకు తెలంగాణ నేతలు పోరు పెడితే అక్కడికి వెళ్లానని చెప్పారు. పుష్కరకాలం తర్వాత కూడా అంత ద్వేషం ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story