AP News : ఏపీలో దారుణం... రీల్స్ చేద్దాం అని బాలికకు తాళి కట్టిన యువకుడు

by M.Rajitha |
AP News : ఏపీలో దారుణం... రీల్స్ చేద్దాం అని బాలికకు తాళి కట్టిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని విశాఖపట్నం(Vishakhapatnam)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్(Instagram Reels) చేద్దాం అని నమ్మించి బాలికను గుడికి తీసుకువెళ్ళి తాళి కట్టాడు ఓ యువకుడు. బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖపట్నం శివారు ప్రాంతమైన తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన ఓ బాలికకు రోజూ ఏదో ఓ రీల్స్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడం అంటే మహా పిచ్చి. ఆ బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే భార్గవ్‌ అనే యువకుడు ఆమె రీల్స్‌ చూసి ఇష్టం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక రీల్స్‌ చూసి లైక్‌ కొట్టేవాడు. అలా బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో ఫోన్‌ నంబర్‌ను భార్గవ్‌ అడిగి తీసుకున్నాడు.

ఆ తర్వాత తనకు కూడా రీల్స్‌ చేయాలని ఉందని.. దానికి సహకరించాలని బాలికను అడిగాడు. అందుకు ఆమె నో చెప్పడంతో చనిపోతానని కూడా బెదిరించాడు. దీంతో సదరు బాలిక అతనితో రీల్స్‌ చేయడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో రీల్స్ చేద్దాం అని కైలాసపురం కొండ మీద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు వెళ్లారు. రీల్స్ భాగం అంటూ బాలికకు బలవంతంగా బాలికకు తాళి కట్టాడు. కొద్దిరోజులు గడిచిన తర్వాత మళ్లీ సదరు బాలికను భార్గవ్‌ సింహాచలం తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి తాళి కట్టి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు బాల్య వివాహ నిరోధక చట్టం, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. శనివారం నాడు భార్గవ్‌ను అరెస్టు చేశారు.

Next Story

Most Viewed