సైనికుడు మురళి నాయక్ మృతి విషాదకరం: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-09 07:14:26  IST  )

దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ మృతి చెందారు..

సైనికుడు మురళి నాయక్ మృతి విషాదకరం: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్(Jawan Murali Naik) మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌(Jammur Kashmir)పై పాకిస్థాన్‌ సైన్యం జరిపిన బాంబు దాడిలో ఆయన అమరుడయ్యారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) స్పందించారు. సైనికుడు మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్‌కు తాను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Next Story