రేపు దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-17 13:19:09  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి దావోస్ పర్యటనకు వెళుతున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు రేపు దావోస్ బయలుదేరనున్నారు.

రేపు దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి దావోస్ పర్యటనకు వెళుతున్నారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు రేపు దావోస్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో ప్రధాన వక్తగా మాట్లాడనున్నారు. మొత్తం ఐదు సెషన్లు ఉండగా మూడు సెషన్లతో చంద్రబాబు, రెండు సెషన్లలో లోకేష్ మాట్లాడనున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు సీఎం దావోస్ లో పర్యటిస్తుండగా ఈ పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్ సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వీరితో పాటు స్విట్జర్లాండ్, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో సమావేశం అవ్వనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో క్లీన్ ఎన‌ర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తో పాటు ఐటీ, ప‌లు కీల‌క రంగాల్లో పెట్టుబ‌డులు ఆక‌ర్షించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. ఇక ప‌ర్య‌ట‌న అనంత‌రం చంద్ర‌బాబు తిరిగి ఈ నెల 23న అమరావతికి పయనమవుతారు.

Read More... మరో సంచలనానికి సిద్ధమైన బండ్ల గణేష్.. భక్తిని, రాజకీయ అభిమానాన్ని చాటుకుంటూ..

Next Story