ప్రధాని మోడీ అరుదైన మైలురాయి.. సీఎం చంద్రబాబు అభినందనలు

by Vemula.Srinu Prasad |

ఎక్కువ కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా ప్రధాని మోడీ నిలవడంపై ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

ప్రధాని మోడీ అరుదైన మైలురాయి.. సీఎం చంద్రబాబు అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్కువ కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా ప్రధాని మోడీ(Pm Modi) నిలిచారు. దేశానికి 8,931 రోజులు సేవలందిస్తూ ఆయన అరుదైన మైలురాయి(Rare Milestone) సాధించారు. దీంతో ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. అంకితభావం, దూరదృష్టి, దేశాభివృద్ధి పట్ల కాంక్షను ప్రతిబింబిస్తోందని కొనియాడారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో ప్రధాని మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రతి భారతీయుడికి మోడీ ప్రేరణగా నిలిచారన్నారు. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. మోడీకి భగవంతుడు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.

Next Story