- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. ప్రమాణాస్వీకారానికి హాజరైన ఏపీ సీఎం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ మార్పు చోటుచేసుకుంది. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్టానియా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడులు మంత్రులుగా ప్రమాణం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రంలో రాజకీయ మార్పు చోటుచేసుకుంది. కోల్‌కతా(Kolkata)లోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి(Suvendu adhikari) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్టానియా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ పదవీ బాధ్యతలను స్వీకరింపజేశారు.
సువేందు అధికారి ప్రమాణస్వీకారానికి పీఎమ్, ఏపీ సీఎం
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కీలక రాజకీయ నేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Pm Modi)తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Union Ministers Amit Shah, Rajnath Singh, BJP National President JP Nadda) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నూతన ప్రభుత్వానికి వారు తమ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయనం
ఎన్డీయే కూటమికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపారు. భారీ జనసందోహం మధ్య జరిగిన ఈ వేడుక బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి వేదికగా నిలిచింది.






