Switzerland: హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |
Switzerland: హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉంటుందనేది తాను ముందుగానే చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. స్విట్జర్‌లాండ్ జ్యురిక్‌(Switzerland, Zurich)లో పారిశ్రామిక వేత్తల(Industrialists)తో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో ఇంజినీరింగ్ కాలేజీలను తీసుకురావడం వల్లే ఉమ్మడి ఏపీ యువత చదువుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ సెంటర్‌ను తీసుకురావడానికి చాలా పోరాటం చేశామని చంద్రబాబు తెలిపారు.

హైదరాబాద్‌లో భూములు అమ్మవద్దని చెప్పా

‘‘మొదటిసారి ఐటీ గురించి మాట్లాడాను. హైదరాబాద్‌లో భూములు అమ్మవద్దని చెప్పాను.. హైదరాబాద్‌ వల్ల దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చింది.. ఉద్యోగాలు చేయడం కాదు, ఇచ్చే స్థాయికి రావాలని చెప్పేవాడిని.. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కట్టిన భవనాలను కూల్చలేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలను చదివించేవారు కాదు.. కాలేజీ సీట్లలో 33 శాతం ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టా. ఏపీ యువత నైపుణ్యాలను పెంచేందుకు చాలా కృష్టి చేస్తున్నాం. ప్రవాసాంధ్రులను ప్రోత్సహించే దిశగా ఆలోచన చేస్తున్నాం. నిరంతరం శ్రమించడం వల్లే తెలుగువాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని రంగాలను ధ్వంసం చేశారు. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. రాష్ట్రాన్ని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా మార్చడమే మా లక్ష్యం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed