- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. 24కు బదులుగా 29న సమావేశం!
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగవలసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (Andhra Pradesh Cabinet Meeting) జరగవలసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 24న (బుధవారం) జరగాల్సి ఉన్న ఈ భేటీని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 29వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ పండుగ (Christmas festival) వేడుకల నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 29న జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా కొత్తగా అమల్లోకి రానున్న సంక్షేమ పథకాలు, పరిశ్రమల స్థాపన, పాలనాపరమైన కీలక మార్పులపై ఈ కేబినెట్ భేటీలో ముందడుగు పడే అవకాశం ఉంది. 24వ తేదీన జరగాల్సిన సమావేశం మాత్రమే వాయిదా పడిందని, 29న యధావిధిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.






