ఏపీ కేబినెట్ భేటీ.. 25 అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-28 09:39:20  IST  )

ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ...

ఏపీ కేబినెట్ భేటీ.. 25 అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి(Amaravati)లోని సచివాలయంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. 25కు పైగా ఏజెండాలపై చర్చిస్తున్నారు. దాన్యం కొనుగోలుకు రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. అమ‌రావ‌తి నిర్మాణానికి రెండో ద‌శలో 7 గ్రామాల్లో16,675 ఎక‌రాల భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు అనుమ‌తిపైనా చర్చిస్తున్నారు. ఏపీల‌కు రూ. 3762 కోట్ల రుపాయిలు రుణం తీసుకునేందుకు అనుమ‌తికి ఆమోదం తెలపనున్నారు. అలాగే ప‌లు సంస్థలకు భూ కేటాయింపుల‌కు మంత్రులకు ఆమోదం తెలిపే అంశంపైనా చర్చిస్తున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపైనా సమావేశంలో చర్చిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరుకల్లా కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలనే అంశంపైనా మంత్రి వర్గంలో చర్చ చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం నిర్ణయాలను ప్రకటించనున్నారు.

Next Story