- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఖీ పౌర్ణమి వేళ మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
రాఖీ సందర్భంగా మహిళలకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: మరో మూడు రోజుల్లో రాఖీ పౌర్ణమి(Rakhi Pornami) వేడుకలు జరగబోతున్నాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. సోదరులకు రాఖీ కట్టించేందుకు సోదరీమణులు సిద్ధమయ్యారు. సొంత ఊళ్లకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీ కట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్(Ap Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల(Women)కు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలు కానున్న ఫ్రీ బస్సు పథకంపై ఈ నెల 9న సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. అంతేకాదు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దు సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. జనగణన ప్రారంభమయ్యేలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు కేబినెట్ మంత్రులు పేర్కొన్నారు.






