- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్.. ఫ్రీ పథకం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు కరెంట్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.....

దిశ, వెబ్ డెస్క్: నాయీ బ్రాహ్మణుల(Nai Brahmins)కు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు కరెంట్ ఇవ్వాలని ఏపీ కేబినెట్(AP Cabinet) నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన అమరావతి సచివాలయం(Amaravati Secretariat)లో భేటీ అయిన కేబినెట్.. 12 అంశాలకు ఆమోదం తెలిపింది. తెలంగాణలోనూ ఈ పథకం అమలు అవుతోంది. తాజాగా ఏపీలోనూ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించింది. అర్హులైన నాయీ బ్రాహ్మణులకు చెందిన హెయిల్ సెలూన్లకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఇక
ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25 నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో అమలు చేయనున్న నూతన బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 ఏపీటీడీసీ హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చారు. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీఐఐసీకి రూ. 7500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మావోయిస్ట్ పార్టీ, ఆర్‌డీఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం కొనసాగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.






