అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-28 07:38:20  IST  )

అజిత్ మరణం మహారాష్ట్రకు తీరని లోటని తెలిపిన సీఎం.

అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని బారామతి వద్ద ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajith Pawar) ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ఆయనతో ప్రయాణిస్తున్నవారు మరణించారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి సహా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రులు సంతాపాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో (AP Cabinet Meeting) అజిత్ పవర్ మృతిపై సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు.

కేబినెట్ ప్రారంభ సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమాన ప్రమాద ఘటన గురించి సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రస్తావించారు. దీంతో అజిత్ పవార్ సహాయ మరో ఐదుగురు చనిపోవడం పట్ల ఏపీ కేబినెట్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ అజిత్ పవర్ తనకు సన్నిహితులని ఆయనతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని సీఎం తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ మృతి తీరని లోటుగా అభివర్ణించారు. వారి కుటుంబానికి, అభిమానులకు, పార్టీ శ్రేణులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

Next Story