కేరళలో కూడా బీజేపీదే: ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు...

కేరళలో కూడా బీజేపీదే:  ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(Bjp) సాధించిన విజయంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్(AP BJP State President P.V.N. Madhav) స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. బెంగాల్ విజయం దేశ రాజకీయాల్లో ఒక గొప్ప సెంటిమెంట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో బెంగాల్‌లో అరాచకాలు, రాజకీయ హింస సృష్టించి భయాందోళనలకు గురిచేశారని, అయితే ప్రజలు ఇప్పుడు అభివృద్ధికి పట్టం కట్టారని ఆయన విమర్శించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో కేరళలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యంగా తెలంగాణలో రాబోయే పరిణామాలు పార్టీకి మరింత బలాన్ని ఇస్తాయని మాధవ్ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నిర్వహించే బహిరంగ సభలో అనేక కీలక విషయాలను ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు. మోదీ నాయకత్వం పట్ల దేశవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని, బెంగాల్ ఫలితాలే దీనికి నిదర్శనమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు.

Next Story