- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభలో ఏపీ అరటి రైతుల ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ అరటి రైతులు (Banana Farmers) ప్రస్తుతం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, వారి కష్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అరటి రైతులు (Banana Farmers) ప్రస్తుతం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, వారి కష్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. అరటి పండ్ల ధరలు దారుణంగా పడిపోయాయని, కిలో అరటి కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 పైసలకు కనీసం ఒక బిస్కెట్ లేదా అగ్గిపెట్టె కూడా రాదు. పంట కోయడానికి అయ్యే ఖర్చు కూడా రైతులకు ఇప్పుడు ఆంధ్రాలో రావడం లేదు" అని మిథున్ రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు, తక్షణ సహాయం ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
వైసీపీ పాలనలో రైతులకు అండగా ఉన్న విధానాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత పంట బీమాతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ (Input Subsidy) వంటి అనేక ప్రోత్సాహకాలు అందించేదని తెలిపారు. అది రైతులపై భారాన్ని తగ్గించిందని ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థికంగా చేయూత అందించడం ఎంతో అవసరమని తెలిపారు. అరటి ధరలు పడిపోవడం, సరైన మద్దతు లేకపోవడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన సభకు వివరించారు.
ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కేంద్ర బృందం ఏపీకి రావాలన్నారు. ప్రభావిత జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను చూడాలని, వారిని అడిగి సమస్యలను తెలుసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అరటి రైతుల సంక్షోభాన్ని అధ్యయనం చేసి, వారికి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా పంటల ధరలు స్థిరంగా ఉండేందుకు, నిల్వ సౌకర్యాలు మెరుగుపరచడానికి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.






