AP Assembly: చట్టాన్ని ఉల్లంఘించడం జగన్‌కు అలవాటే.. అసెంబ్లీలో నారా లోకేశ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

చట్టాన్ని ఉల్లంఘించడం మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)కు అలవాటేనని మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు.

AP Assembly: చట్టాన్ని ఉల్లంఘించడం జగన్‌కు అలవాటే.. అసెంబ్లీలో నారా లోకేశ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చట్టాన్ని ఉల్లంఘించడం మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)కు అలవాటేనని మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో ప్రతిపక్ష హోదాపై ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతోందని అన్నారు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి హోదా ఇవ్వమని అడగటం హస్యాస్పదంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారం జగన్‌ (Jagan)కు జె‌డ్ ప్లస్ హోదా ఇచ్చామని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం వవన్ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan) కంటే జగన్‌కే ఎక్కువ భద్రత ఉందని కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదాపై లోక్‌సభ (Lok Sabha) రూల్ బుక్‌ (Rule Book)లో క్లియర్‌‌గా ఉందని.. గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై ఇదే సభలో క్లారిటీ ఇచ్చారని అన్నారు. నేడు మళ్లీ జగన్ తమ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదాపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘటన నోటీసుల ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Next Story