రాష్ట్రంలో మరో వైట్ కాలర్ నేరం.. రూ.50 కోట్లతో పరారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-26 11:41:27  IST  )

రాష్ట్రంలో మరో వైట్ కాలర్ నేరం వెలుగులోకి వచ్చింది...

రాష్ట్రంలో మరో వైట్ కాలర్ నేరం.. రూ.50 కోట్లతో పరారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో వైట్ కాలర్ నేరం వెలుగులోకి వచ్చింది. యూపిక్స్ యానిమేషన్ పేరుతో కిరణ్ అనే వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పరారీ అయ్యారు. ఈ ఘటన రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో జరిగింది. కిరణ్ అనే వ్యక్తి విజయవాడలో మూడు సంస్థలను ఏర్పాటు చేసి బోర్డు తిప్పేశారు. తన పేరుతో యూపిక్స్ యానిమేషన్, ఏజెంట్ శ్రీకాంత్ అనే వ్యక్తి పేరుతో ఓషెన్ బ్లూ సంస్థను, ఏజెంట్ చేతన్ పేరుతో టెకీ సాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే లక్షకు రూ. 2 లక్షలు, రూ. 2 లక్షలకు 4 లక్షలు ఇస్తామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో చాలా మంది డిపాజిట్లు చేశారు. విజయవాడకు చెందిన కృష్ణకాంత్ అనే వ్యక్తి ద్వారాను డిపాజిట్లను సేకరించారు. డిపాజిట్ దారులకు కొన్ని నెలలు సక్రమంగానే డబ్బులు చెల్లించారు. గత ఏడాది నుంచి డబ్బులు చెల్లించడంలేదు. ఇలా రాష్ట్రంలోనే కాదు అమెరికాలో ఉన్న వ్యక్తుల నుంచి సైతం డబ్బులు వసూలు చేశారు. ఈ వ్యాపారం లక్షల నుంచి కోట్లలోకి వెళ్లింది. దీంతో కిరణ్ కుటుంబ పరారీలో ఉంది. ఆరు నెలల నుంచి అదృశ్యం అయింది. బంధువులు, ఏజెంట్లతో కూడా టచ్‌లో లేరు. కిరణ్ సంస్థల్లో నరసరావుకుపేటకు చెందిన వ్యక్తి దాదాపు రూ. 16 లక్షలు మోసపోయినట్లు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. మరో వ్యక్తి కూడా డబ్బులు డిపాజిట్లు చెల్లించి మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

కిరణ్ ద్వారా మోసపోయిన బాధితులు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు కిరణ్ సహా మరో రెండు సంస్థల అకౌంట్లలో రూ. 10 వేసినట్లు గుర్తించారు. ఈ స్కామ్‌లో కిరణ్‌తో పాటు ఆయన భార్య పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థల బాధితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు తేలింది. నిడమోలు కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్ తన వద్ద పెట్టుకున్న ఏజెంట్ల ద్వారా రూ.50 నుంచి 70 కోట్ల వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు శ్రీకాంత్ తో పాటు చేతన్‌, కృష్ణకాంత్‌ను పోలీసుల విచారిస్తున్నారు. త్వరలోనే కిరణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story