దేశంలో మరో సమర శంఖం.. ఏపీతో సహా 24 స్థానాలకు నోటిఫికేషన్

by Vemula.Srinu Prasad |

రాజ్యసభకు సంబంధించి దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 24 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల పరిధిలోని ఈ స్థానాలకు జూన్ 1న అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ..

దేశంలో మరో సమర శంఖం.. ఏపీతో సహా 24 స్థానాలకు నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభకు సంబంధించి దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 24 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల పరిధిలోని ఈ స్థానాలకు జూన్ 1న అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 8 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చని, మరుసటి రోజైన జూన్ 9న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు జూన్ 11లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు విధించారు.

18న తుది ఘట్టం

ఇక జూన్ 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిచనుంది ఈసీ. ఏపీకి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలు ఈ జాబితాలో ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఈ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

జూన్ 26తో ముగియనున్న నలుగురు సభ్యులు

ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు కీలక సభ్యుల పదవీకాలం జూన్ 26తో ముగియనుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పదవీకాలం ముగిసే వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి పరిమళ్ నత్వానీతో పాటు సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ ఉన్నారు. ఈ నలుగురి స్థానంలో కొత్తగా పెద్దల సభలోకి అడుగుపెట్టబోయే ఆ నలుగురు నాయకులు ఎవరనే ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Next Story