అమరావతి అభివృద్ధిలో మరో అడుగు..శాశ్వత హైకోర్టు పనులు ప్రారంభం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-20 12:34:37  IST  )

అమరావతి అభివృద్ధిలో మరో అడుగు పడింది. శాశ్వతంగా హైకోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది..

అమరావతి అభివృద్ధిలో మరో అడుగు..శాశ్వత హైకోర్టు పనులు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) అభివృద్ధిలో మరో అడుగు పడింది. శాశ్వతంగా హైకోర్టు(High Court)ను నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు రాఫ్ట్ ఫౌండేషన్(Raft foundation) పనులను తాజాగా మంత్రి నారాయణ(Minister Narayana) ప్రారంభించారు. మరోవైపు ఐకానిక్ టవర్స్‌లోనే రాష్ట్ర డీజీపీ ఉండాలా లేదా విడిగా ఉండాలా అనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని, శాఖల వారీగా ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్‌పై మరోసారి చర్చిస్తామని నారాయణ చెప్పారు. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సీఎస్ విజయానంద్‌ను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తం 39, 852 మంది ఉద్యోగులు పని చేసేలా భవనాల డిజైన్లను రూపొందించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Next Story