ఏపీలో లొంగిపోయిన మరో మావోయిస్టు

by Vemula.Srinu Prasad |

ఏపీలో మరో మావోయిస్టు లొంగిపోయారు...

ఏపీలో లొంగిపోయిన మరో మావోయిస్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(AP)లో మరో మావోయిస్టు(Maoist) లొంగిపోయారు. అల్లూరి జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్‌లో ఓఎస్డీ జగదీశ్ అడహళ్లి, సీఐ, ఎస్ఐ, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట మడకం హిడమ లొంగిపోయారు. మడకం హిడమ అత్యంత చిన్న వయస్కుడు కావడం విశేషం. 18 సంవత్సరాలకే మావోయిస్టు సభ్యుడిగా పని చేశారు. మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పని చేసేవారు.. జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో హిడమ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

కాగా ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. మహారాష్ట్ర తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాతో పాటు పలు రాష్ట్రాల్లో మావోయిస్టులను గుర్తించి ఎన్ కౌంటర్ చేశారు. అటవీ ప్రాంతాల్లో ఇంకా కూంబింగులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మడకం హిడమ మావోయిజాన్ని వదలిలేసి జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Next Story