గాజువాక వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత రాజీనామాచేశారు. ..

గాజువాక వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party)కి మరో కీలక నేత రాజీనామా(Resign) చేశారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జి ముఖ్య అనుచరుడు, గాజువాక నాయకుడు దామా సుబ్బారావు(Gajuwaka leader Dama Subbarao) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంలో పార్టీలో ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దామా సుబ్బారావు ఆగడాలు కొనసాగించారు.స్థలాల విషయంలో వీఎంఆర్డీఏ అధికారులను బెదిరించిన ఆరోపణలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరతారనే అంశంపై క్లారిటీ రావాల్సి అవసరం ఉందని పలువురు నాయకులు అంటున్నారు.

Next Story