ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్

by Vemula.Srinu Prasad |

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బాధితురాలు హర్షవీణ ప్రత్యక్షమయ్యారు...

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar) వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ(TDP) కార్యాలయంలో బాధితురాలు హర్షవీణ(Harshaveena Victim) ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ముఖ్యనేత ముక్కా రూపానందరెడ్డి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌(Prajadarbar)లో తన సమస్యను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయం చేయండి

ఈ సందర్భంగా హర్షవీణ మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో తనకు న్యాయం జరిగేలా సహకరించాలని ముక్కా రూపానందరెడ్డిని కోరారు. తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదంలో బాధితురాలు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరడం సరికొత్త ట్విస్ట్‌గా మారింది.

Next Story