TTD ఈవో‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్.. హాజరైన చైర్మన్ బీఆర్ నాయుడు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-10 06:48:22  IST  )

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (EO)గా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

TTD ఈవో‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్.. హాజరైన చైర్మన్ బీఆర్ నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (EO)గా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌తో చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) ప్రయాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగ నాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు వేద పండితులు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఇక బదిలీపై వెళ్లిన టీటీడీ మాజీ ఈవో శ్యామల రావుకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్యామల రావు మాట్లాడుతూ.. పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప తితిదే ఈవోగా పనిచేసే భాగ్యం కలగదని అన్నారు. ముఖ్యంగా తనకు ఈవోగా పనిచేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చా టీటీడీ మాజీ ఈవో శ్యామల రావు అన్నారు.

కాగా, ఈనెల 8న రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ (IAS)లను బదిలీ చూస్తూ సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామల రావు (Shyamala Rao)ను జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఇక రెవెన్యూ (ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీగా సీహెచ్ శ్రీధర్, కార్మిక శాఖ సెక్రటరీగా శేషగిరి బాబు, గవర్నర్ స్పషల్ సెక్రటరీగా అనంతరాం, ఆర్‌ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కృష్ణ బాబు, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.

Next Story