- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రోజు కొడుతున్నారు, తిండి కూడా పెట్టడం లేదు.. దుబాయ్‌లో ఏపీ మహిళ కన్నీటి గాథ
కిలీ ఏజెంట్ల మోసాలకు తెలుగు రాష్ట్రాల్లోని అమాయక ప్రజలు బలి అవుతున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: నకిలీ ఏజెంట్ల మోసాలకు తెలుగు రాష్ట్రాల్లోని అమాయక ప్రజలు బలి అవుతున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో మహిళా దుబైలో చిక్కుకుపోయి తనని కాపాడాలని పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్‌లో ఉపాధి కోసం వెళ్లి, అక్కడి యజమానుల వేధింపులకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ ఒకరు కన్నీటితో వీడియో చెప్పుకొచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండకు చెందిన వీరంశెట్టి మంజుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంచి జీవనం కోసం దుబాయ్ వెళ్లగా, ఆమెను నకిలీ ఏజెంట్ మోసం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యజమానుల చేతుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, "రోజూ కొడుతున్నారని, కనీసం సరిగా తిండి కూడా పెట్టడం లేదని" ఆ వీడియోలో మహిళ కన్నీటి పర్యంతమైంది.
గతంలో కూడా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన అనేక మంది మహిళలు ఇలాంటి ఏజెంట్ల మోసాలకు బలయ్యారు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, వారి పాస్‌పోర్ట్‌లు లాక్కొని, గృహహింసకు గురిచేసిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ దుస్థితి లో చిక్కుకున్న మంజుల, తనను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని వీడియో ద్వారా ఆమె కన్నీటితో అభ్యర్థించింది. వేధింపులకు గురవుతున్న ఈ మహిళకు సహాయం చేయడానికి ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు.






