మరోసారి తమ దొంగబుద్ధిని బయటపెట్టుకున్న వైసీపీ కార్యకర్తలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-28 06:42:04  IST  )

మరోసారి తమ దొంగబుద్ధిని వైసీపీ కార్యకర్తలు బయటపెట్టుకున్నారు...

మరోసారి తమ దొంగబుద్ధిని బయటపెట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో పలువురు వైసీపీ నేతలు దొంగ బుద్ధి చూపించబోయి రాష్ట్రంలో పలుచోట్ల అడ్డంగా బుక్కయిన ఘటనలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి సైతం వైసీపీ కార్యకర్తలు తమ దొంగబుద్ధిని బయటపెట్టుకున్నారు. అనంతపురంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. జవహర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా వైసీపీ కార్యకర్తలు బోయ ఎర్రప్ప కుటుంబం వద్దకు వెళ్లి ఫోన్ స్కాన్ చేస్తే చంద్రబాబు మోసాలు బయటపడతాయని చెప్పారు. దీంతో వాళ్ల ఫోన్ తీసుకుని పే స్కాన్ చేసి డబ్బులు కొట్టేశారు. డబ్బులు కట్ అయిన్ మెసేజ్‌ను కూడా డిలీట్ చేశారు. అనంతరం ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు. అయితే ఎర్రప్ప ఓ షాపు వద్దకు వెళ్లారు. పలు సామాగ్రి కొన్నారు. అనంతరండబ్బులు చెల్లించేందుకు ఫోన్ పే స్కాన్ చేశారు. కానీ డబ్బులు కట్ కాలేదు. చెక్ ద అమౌంట్ అంటూ చూపించింది. దీంతో బ్యాలెన్స్ చెక్ చేయగా జీరో అమౌంట్ అని చూపించింది. అకౌంట్లో ఉన్న రూ.11 వేలు కొట్టేశాసినట్లు ఎర్రప్ప గుర్తించారు. అనంతపురం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story