రహదారి విషయంలో ఘర్షణ.. పొట్టుపొట్టు కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం ఎర్రంపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

రహదారి విషయంలో ఘర్షణ.. పొట్టుపొట్టు కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: రహదారి విషయంలో జరిగిన ఘర్షణలో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) కార్యకర్తలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం ఎర్రంపల్లి(Errampalli)లో జరిగింది. స్థానిక టీడీపీ కార్యకర్తలు శివానంద, వినోదమ్మ, సునందపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు గుమ్మగుట్ట పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామంలో మరోసారి గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

Next Story