- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్యాణదుర్గంలో నేడు మంత్రి లోకేష్ పర్యటన
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గానికి (Kalyana Durgam) విచ్చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గానికి (Kalyana Durgam) విచ్చేయనున్నారు. కళ్యాణదుర్గంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక పార్టీ నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. పోలీసు అధికారులు పర్యటనకు సంబంధించిన భద్రతా చర్యలను పరిశీలించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లను టీడీపీ (TDP) నేతలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.
భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ
భక్త కనకదాసు ఒక సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆయన జయంతిని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం వేడుకలను నిర్వహించనుంది. కళ్యాణదుర్గంలో జరగనున్న ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని (Statue) మంత్రి ఆవిష్కరిస్తారు. గతేడాది కూడా అనంతపురంలో భక్త కనకదాసు రాష్ట్ర స్థాయి జయంతిని ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది కూడా కళ్యాణదుర్గంతో పాటు వివిధ జిల్లాల్లో వేడుకలను నిర్వహించనుంది.






