Kalyandurgam: నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్టు. రూ.3.45 లక్షల స్వాధీనం

by Disha Web Desk 16 |
Kalyandurgam: నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్టు. రూ.3.45 లక్షల స్వాధీనం
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.45 లక్షల నగదుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 1న, 9న స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి నగదు డ్రా చేయడానికి వెళ్లిన శీర్పికొట్టాల గ్రామానికి చెందిన చాకలి శంకరయ్య, యూనియన్ బ్యాంక్‌లో నగదు జమ చేయడానికి వెళ్లిన కళ్యాణదుర్గంకి చెందిన రవికుమార్ నుంచి ముఠా సభ్యులు చాకచక్యంగా నగదు చోరీ తీసుకెళ్లారు. బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సిసి ఫుటేజ్ ఆధారంగా పది రోజుల వ్యవధిలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన ముఠా సభ్యుల్లో కుంచెల సుబ్రహ్మణ్యం, పసుపులేటి వినోద్, గోగుల తులసిందర్, పసుపులేటి రమేష్‌లు ఉన్నారు. వీరందరిదీ చిత్తూరు జిల్లా నగరి మండలం ఓ జి. కుప్పం గ్రామం. వీరిపై తమిళనాడు, కర్ణాటక , ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనం కేసులున్నాయి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా బ్యాంక్ అధికారులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు తెలిపారు. కస్టమర్లు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో మరొకరిని తోడుగా తీసుకెళ్లాలని సూచించారు. షాపులో యజమానులు కూడా సీసీ కెమెరాలుతో పాటు నిఘా ఉంచాలని, కొత్త వ్యక్తుల కదలికలను తమ దృష్టికి తీసుకురావాలని, 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.


Next Story

Most Viewed