అనంతపురంలో గన్‌ కలకలం.. మహిళా పీఎస్ లో కేసు నమోదు

by Naga Rani Yarlagadda |

అనంతపురంలో గన్ కల్చర్ కలకలం రేపింది. భార్యను గన్ తో బెదిరించిన ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.

అనంతపురంలో గన్‌ కలకలం.. మహిళా పీఎస్ లో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురంలో గన్ కల్చర్ కలకలం రేపింది. భార్యను గన్ తో బెదిరించిన ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. నగరంలోని విద్యుత్ నగర్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్,మనుషా దంపతుల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను భయపెట్టేందుకు రాజశేఖర్ గన్ తో బెదిరించాడు. దీంతో మనుషా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాజశేఖర్ నుంచి పోలీసులు గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. కాగా.. రాజశేఖర్ కు గన్ ఎక్కడ లభించింది. ఎవరిని నుంచి కొన్నాడు. అది లైసెన్సుడా కాదా అన్న విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story