ఎంత దూరమైనా వెళ్తాం: ప్రభుత్వానికి శైలజానాథ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

శింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా తాగు, సాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కనీసం గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు వినకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు..

ఎంత దూరమైనా వెళ్తాం: ప్రభుత్వానికి శైలజానాథ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: శింగనమల నియోజకవర్గం(Singanamala Constituency) వ్యాప్తంగా తాగు, సాగునీటి (Drinking and irrigation water)సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కనీసం గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు వినకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సాకే శైలజానాథ్(Former Minister Saake Sailajanath) మండిపడ్డారు. గార్లదిన్నె, నార్పల, పుట్లూరు, శింగనమల మండలాల పరిధిలో నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాపినేపాళ్యం, చిన్న జలాలపురం, నడిమిదొడ్డి, ఎల్లుట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల్లో మాజీ మంత్రి శైలజానాథ్ పర్యటించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సరైన విధానం కాదు..

గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితమై ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం సరైన విధానం కాదని ఆయన విమర్శించారు. ఎక్కడో కూర్చొని రివ్యూలు చేస్తే సమస్యలు పరిష్కారం కావని, క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల బాధలు చూడాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని డా. సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలు ఇలాగే కొనసాగితే ప్రజల ఆవేదన మరింత పెరుగుతుందని హెచ్చరించిన ఆయన, ప్రజల పక్షాన వైయస్ఆర్ పార్టీ మరోసారి పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని డా. సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.

Next Story