- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rayadurgam: భోగి మంటల్లో జీవో నెంబర్ వన్ ప్రతులు
రాష్ట్రంలో ఆరాచక పాలన, ఒక చీకటి పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు విమర్శించారు...

దిశ,రాయదుర్గం: రాష్ట్రంలో ఆరాచక పాలన, ఒక చీకటి పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జీవో నెంబర్ వన్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకుల సభలు, సమావేశాలు జరగకూడదని రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ ప్రతులను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు భోగి మంటల్లో దాహనం చేయడం జరిగిందన్నారు.
ప్రజాస్వామ్య హక్కులను రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గ పాలనకు నిరసనగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను దహనం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని తక్షణమే జీవో నెంబర్ ఒకటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే న్యాయస్థానం ఆ ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలుపదల చేయడం జరిగిందన్నారు. న్యాయస్థానాలు ఓవైపు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను తప్పుపడుతూ , మొట్టికాయలు వేస్తు్నాయని కాలువ శ్రీనివాసులు గుర్తు చేశారు.






