- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anantapur: లక్ష్మంపల్లిలో దారుణం.. కాపు కాసి రైతుపై దుండగుల దాడి
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో రైతు చంద్రన్నపై దుండగులు దాడి చేశారు...

X
దిశ కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో రైతు చంద్రన్నపై దుండగులు దాడి చేశారు. సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న చంద్రన్నను కాపు కాసి మరీ పిడుగుద్దులు కురిపించారు. కేసు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. అయితే దుండగుల దాడిలో చంద్రన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం అదే కుటుంబానికి సంబంధించిన వైసీపీ కార్యకర్త నాగభూషణ్‌పై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే కుటుంబానికి సంబంధించిన రైతు చంద్రన్నపై దాడి జరగడంతో నాగభూషణ్‌పై దాడి చేసిన యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపైనా పోలీసుల కేసు నమోదు చేశారు.
Next Story






