- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సమయ భర్తను దగ్గుపాటి ప్రసాద్ బెదిరిస్తున్నట్టు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సమయ భర్తను దగ్గుపాటి ప్రసాద్ బెదిరిస్తున్నట్టు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడియోలో డాక్టర్ భర్తను ఎమ్మెల్యే బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. డాక్టర్ ను ఉద్దేశించి సైతం అసభ్యంగా దూషించారు. ఎమ్మెల్యే తన ఆస్తి కాజేసే కుట్ర చేశాడని డాక్టర్ సుమయ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేతో వివాదంపై సమయ ఆగస్టు 2025లోనే వీడియో విడుదల చేశారు. తమ ఆస్పత్రికి కొందరు వచ్చి దౌర్జన్యం చేశారని అన్నారు. ఏం తప్పు చేశారని తమను పగబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీకి ఫిర్యాదు చేశామని ఫిర్యాదు తరవాత తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే దగ్గుపాటి ప్రసాద్ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ దగ్గుబాటి ప్రాసాద్ తిట్టినట్టు ఓ ఆడియో వైరల్ అవ్వడం కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.






