Anantapur | టేకులోడులో తాగునీటి సమస్య!!

by Thanuru Gopichand |

ఉమ్మడి అనంతపురం.. ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లాలోని టేకులోడులో తాగునీటి సమస్య (Water Supply Issue In Tekulodu) నెలకొంది.

Anantapur | టేకులోడులో తాగునీటి సమస్య!!
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి అనంతపురం.. ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లాలోని టేకులోడులో తాగునీటి సమస్య (Water Supply Issue In Tekulodu) నెలకొంది. హిందూపురం నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం పరిధిలో ఈ గ్రామం ఉంది. గత కొన్ని నెలలుగా తాగునీటి సరఫరాలో సమస్యలు ఉన్నాయని.. దాని వల్ల ఇబ్బందులు పడుతున్నామన గ్రామస్తులు వాపోతున్నారు. సమస్య ఎక్కువ కావడంతో తాము నిరసనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య వేధిస్తున్నప్పటికీ పరిష్కారం లభించడం లేదంటున్నారు. ఈ విషయమై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సమస్య తీరకపోవడంతో చేసేదేమిలేక గురువారం నిరసనకు దిగామని చెబుతున్నారు. నిరసనలో భాగంగా గ్రామ సచివాలయానికి తాళం వేశామన్నారు. కొన్ని నెలలుగా గుక్కెడు నీటి కోసం గ్రామస్తులంతా ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని.. అయితే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేకనే తాము గ్రామ సచివాలయానికి తాళం వేశామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో తాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.

Next Story