మాకవరపాలెంలో జగన్ పర్యటన.. ఆ ఇబ్బంది ఉండకూడదనే హెలికాప్టర్ కు అనుమతి

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో పర్యటించనున్నారు.

మాకవరపాలెంలో జగన్ పర్యటన.. ఆ ఇబ్బంది ఉండకూడదనే హెలికాప్టర్ కు అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటనకు హెలికాప్టర్ కు అనుమతినిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ తెలిపారు. ఇందుకు గల ప్రధాన కారణాన్ని ఆయన మీడియాకి చెప్పారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి మాకవరపాలెం వరకూ 63 కిలోమీటర్ల మేర రోడ్డుమార్గం ద్వారా జగన్ వచ్చేందుకు వైసీపీ నేతలు పర్మిషన్ కోరినట్లు చెప్పారు. అయితే ఈ సమయంలో ప్రధాన కూడళ్ల వద్ద జనసమీకరణ చేసి.. ప్రదర్శన చేస్తారన్న సమాచారం ఉండటంతో.. తమిళనాడులో ఇటీవల విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని జగన్ రోడ్డుమార్గంలో వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా, అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే జగన్ మాకవరపాలేనికి హెలికాప్టర్లో రావాలని కోరినట్లు చెప్పారు.

Next Story