AP News : అనకాపల్లి అగ్నిప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

by Muthe.Rajitha |

ఏపీ(AP)లోని అనకాపల్లి జిల్లా(Anakapally) కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు(Fireworks Explode) జరిగిన విషయం తెలిసిందే.

AP News : అనకాపల్లి అగ్నిప్రమాదం.. మృతుల వివరాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని అనకాపల్లి జిల్లా(Anakapally) కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు(Fireworks Explode) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కాగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశాఖ కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వారు అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవింద్(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38), పురం పాప(40), గుంపిన వేణుబాబు(40), సేనాపతి బాబూరావు(56), మనోహర్(44)గా పోలీసులు గుర్తించారు.

మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులను, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story