ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-27 12:23:04  IST  )

30 మంది ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.......

ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: 30 మంది ప్రయాణికుల(Passenger)తో ఉన్న ఆర్టీసీ బస్సు(RTC Bus)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన క‌ర్నూలు జిల్లా పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌(RTC Bustand)లో బస్సు(Bus) టైరు పేలింది. 30 మందికి పైగా ప్రయాణికులతో గుంతకల్లు(Guntakallu)కు బయల్దేరేందుకు బ‌స్సు సిద్ధ‌ంగా ఉన్న టైరు పేలుడుతో భారీ శబ్దం వచ్చింది. దీంతో ప్రయాణికులంతా బస్సు నుంచి సురక్షితంగా దిగారు. రన్నింగ్ బస్సు(Running Bus)లో పేలుడు సంభవించి ఉంటే నష్టం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు(Kurnool Bus) ప్రమాదంతో జర్నీ అంటేనే భయమేస్తోందని, ఆర్టీసీ బస్సులకు కూడా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని కోరుతున్నారు.

Next Story