- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవింగ్ సీటులోనే కుప్పకూలిపోయిన డ్రైవర్.. బస్సులో19 మంది ప్రయాణికులు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద డ్రైవింగ్ సీటులోనే ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ కుప్పకూలిపోయారు..

దిశ, వెబ్ డెస్క్: డ్రైవింగ్ సీటులోనే ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్(APSRTC driver) కుప్పకూలిపోయారు. ఈ సమయంలో 19 మంది ప్రయాణికులు(Passengers) బస్సు(bus)లో ఉన్నారు. గుండెపోటు రావడంతో బస్సును డ్రైవర్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీఆర్టీసీ డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును డ్రైవర్ రోడ్డులోనే ఆపేశారు. వెంటనే ఆయన్ను ప్రయాణికులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ బస్సు డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు విజయవాడ డిపోలో పని చేస్తున్న డ్రైవర్ నాగరాజుగా గుర్తించారు. గొల్లపూడికి చెందిన నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమరావతి బస్సును మియాపూర్ నుంచి విజయవాడకు తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక ఘటనతో ప్రయాణికులను మరో బస్సులో విజయవాడ తరలించారు.






