- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర అగ్ని ప్రమాదం.. నడి రోడ్డు పై తగలబడిన అంబులెన్స్
రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. కదులుతున్న అంబులెన్స్(ambulance)లో ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగాయి. ఈ క్రమంలో ఎగిసిపడుతున్న మంటలతో భారీ ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రోగి బంధువులు ఫోన్ చేశారు. ఈ క్రమంలో తమ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగోలేదని వెంటనే రావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం సూచనల మేరకు 108 అంబులెన్స్ డ్రైవర్.. రోగి ఇంటికి బయలుదేరాడు.
అయితే రోడ్డుపై అంబులెన్స్ వెళుతున్న తరుణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ క్రమంలో స్థానికులు అప్రమత్తం చేయడంతో రోడ్డు పైనే అంబులెన్స్ ఆపేశాడు. వెంటనే డ్రైవర్ దిగిపోయాడు. భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. అయితే వారు వచ్చే లోపే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు మంటలు భారీగా వ్యాపించడంతో ప్రక్కనే ఉన్న సిటీ బస్టాప్(Bus Stop) సైతం తగలబడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రమాద ఘటనలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.






