కొత్త సంస్కృతికి చంద్రబాబు నాంది పలికారు: మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Government)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త సంస్కృతికి చంద్రబాబు నాంది పలికారు: మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Government)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్‌ పడిపోయిందని విమర్శించారు. సుపరిపాలనకు కాదు.. దుర్మార్గమైన పాలనకు తొలి అడుగు పడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. గొప్పలకుపోయి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలపై కూటమి నేతలు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలం అయ్యారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని.. విద్యార్థులు, ప్రజలు సంతోషపడ్డారని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ మళ్లీ భ్రష్టు పెట్టే రోజులు వచ్చాయని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి భయపెట్టాలనే కొత్త సంస్కృతికి చంద్రబాబు(Chandrababu) నాంది పలికారని అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story