- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మగౌరవ ప్రతీక అమరావతి : గెజిట్ నోటిఫికేషన్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు ప్రతీక అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు ప్రతీక అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజధాని రైతుల త్యాగానికి, రాష్ట్ర ప్రజల ఆశలకు దక్కిన చారిత్రక విజయమని, అందరం కలిసి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని కలను సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు బిల్లుకు మద్దతిచ్చిన సభ్యులందరికీ బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026'పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఇది చట్టరూపం దాల్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సోమవారం రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. గతంలో ఉన్న 'మూడు రాజధానుల' ప్రతిపాదనలకు తావులేకుండా, సెక్షన్ 5(2)కు సవరణలు చేస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్‌లో పేర్కొంది.






