అల్లూరి జిల్లా | పొగమంచు కారణంగా ప్రమాదం.. ఒకరి మృతి

by Thanuru Gopichand |   (  Updated:2025-12-11 05:07:57  IST  )

పొగమంచు (Fog) కారణంగా రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

అల్లూరి జిల్లా | పొగమంచు కారణంగా ప్రమాదం.. ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పొగమంచు (Fog) కారణంగా రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పరిధిలోని రాళ్లగడ్డ వంతెన వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మేఘాలకొండ నుంచి అరకు వెళ్తున్న ఓ కారు రాళ్లగడ్డ వద్ద వంతెనను ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. అయితే మృతి చెందిన వ్యక్తిని గీతం కళాశాలకు చెందిన విద్యార్థి రుద్రగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పొగమంచులో డ్రైవింగ్ చేయడంతో రహదారి కనిపించక వంతెనను ఢీకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. విహారం కోసం బయలుదేరి ప్రమాదానికి గురై విద్యార్థి మరణించడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా నమోదవుతున్నాయి. రహదారులను పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. చాలా ప్రాంతాల్లో నాలుగు నుంచి 7 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున పొగమంచులో ప్రయాణం చేయడం సరికాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పొగమంచులో వాహనాల్లో ప్రయాణించొద్దని కోరుతున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సిన వస్తే తగిన జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అజాగ్రత్తగా పొగమంచులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలో చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు.

Next Story