‘ఇదంతా.. దోచుకున్నది.. దాచుకోవడానికే’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-02 06:52:45  IST  )

ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ(YSRCP) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు.

‘ఇదంతా.. దోచుకున్నది.. దాచుకోవడానికే’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ(YSRCP) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గత 30 ఏళ్లలో సీఎం చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికే ఆయన అన్నిసార్లు అక్కడికి వెళ్లారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో సింగపూర్‌(Singapore)లో పెట్టుబడులు పెట్టారని గుడివాడ అమర్నాథ్(Former Minister Gudivada Amarnath) సంచలన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో రియల్‌ఎస్టేట్‌పై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్‌(Minister Nara Lokesh) ఆరాటపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిందేమిటి అని ఆయన ప్రశ్నించారు.15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ క్రమంలో ఏపీలో అదానీ డేటా సెంటర్ వచ్చిందే వైసీపీ హయాంలో అన్నారు. అదానీ డేటా సెంటర్‌పై లోకేష్‌ గొప్పలు చెప్పారు. కానీ.. మంత్రి నారా లోకేష్ చెబుతున్నా బ్లూ ఎకానమీకి వైసీపీ పాలనలోనే అంకురార్పణ జరిగింది అని మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పుకొచ్చారు.

Next Story