AP liquor Scam : లిక్కర్​స్కాం​ డబ్బులన్నీ.. తాడేపల్లి ప్యాలెస్ లోని 4వ నెంబర్ గదికే..: టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు

by Thanuru Gopichand |   (  Updated:2025-05-08 05:14:01  IST  )

ఏపీలో లిక్కర్ స్కాం దోషులను వెంటనే తేల్చాలని ఎంపీ కేసినేని శివనాథ్​ (చిన్ని) డిమాండ్ చేశారు.

AP liquor Scam : లిక్కర్​స్కాం​ డబ్బులన్నీ.. తాడేపల్లి ప్యాలెస్ లోని 4వ నెంబర్ గదికే..: టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో లిక్కర్ స్కాం దోషులను వెంటనే తేల్చాలని ఎంపీ కేసినేని శివనాథ్​ (చిన్ని) (Kesineni Chinni) డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సీబీఐకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈరోజు విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో సీబీఐకి (CBI) రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి జగన్ (YS Jagan) వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడని పరోక్షంగా కేశినేని నానిని (Kesineni Nani) ఉద్దేశించి ఆరోపించారు. తనకు, లిక్కర్ స్కాంలో దోషిగా ఉన్న కేసిరెడ్డికి సంబంధం ఉన్నట్లు అతను ఆరోపణలు చేశాడని తెలిపారు. 2020లో తాను కేసిరెడ్డిని కలిసిన మాట వాస్తవమే అన్నారు. హైదరాబాదులో ఉన్న తన ఆస్తికి ఆయన పక్కనే ఉంటారని తెలిపారు. నేను అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవమే అని తెలిపారు. ఆరు నెలల తర్వాత అతను జగన్ మనిషి అని తెలుసుకుని.. ఆ రోజు నుంచి అతనితో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారని అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు అతనితో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదన్నారు.

ఏపీలో జరిగిన లిక్కర్​స్కాంను డైవర్ట్​చేసేందుకు ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రూ.3600 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అనేమాట వాస్తవం అన్నారు. ఈ స్కాంలో భాగస్వాములు ఎవరనేది ప్రజలందరికీ ఎప్పుడో అర్థమైంది అని తెలిపారు. అన్ని దారులు కూడా తాడేపల్లి ప్యాలెస్ లోని నాలుగో నెంబర్ గది వైపే చూపిస్తున్నాయని అన్నారు. ఆ నాలుగో నెంబర్ గదిలో నలుగురికి అనుమతి ఉందన్నారు. ఆ నలుగురు లిక్కర్ స్కామ్ లో ఉన్న వారేనని ఆరోపించారు. అందులో ఇద్దరు దంపతులు ఉన్నారని అన్నారు. పది రోజుల కిందట హైదరాబాదులో ఒక సమావేశం జరిగిందని.. అందులో ఐదుగురు పాల్గొన్నారు అని తమకు సమాచారం ఉందన్నారు. ఆ ఐదుగురిలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, వీరితోపాటు విజయవాడ పాలేరు కూడా ఉన్నారని అన్నారు. మరో వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పాలేరు జగన్​కు ఎప్పుడో అమ్ముడుపోయారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా ప్రతి విషయాన్ని జగన్ కు ఆ పాలేరు చేసేవాడని ఆరోపించారు. జగన్ రెడ్డీ ..నువ్వు నిజాయితీపరుడు అయితే నువ్వు కూడా నాది ఏ తప్పూ లేదు అంటూ సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్​చేశారు.

Next Story