Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దివ్య దర్శనం టోకెన్ల జారీ ఎక్కడంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-05 11:33:22  IST  )

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దివ్య దర్శనం టోకెన్ల జారీ ఎక్కడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో కాలినడకన తిరుమల(Tirumala) చేరుకొని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్ల పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో దివ్యదర్శన టోకెన్ల జారీకి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఉద్దేశించిన ఈ టోకెన్లను రేపు సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేయనున్నారు. అయితే.. భక్తులు గతంలో మొదటి మెట్టు సమీపంలోనే టోకెన్లు తీసుకొని 1,200 మెట్టు వద్ద స్కాన్ చేసుకునేవారు. కానీ, ప్రస్తుతం టీటీడీ(TTD) టోకెన్లు జారీలో కీలక మార్పులు చేసింది.

ఈ క్రమంలో దివ్యదర్శన టోకెన్ల జారీకి శ్రీనివాసమంగాపురం వద్ద శాశ్వత కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు భూదేవి కాంప్లెక్స్‌లలో టోకెన్లు అందించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా బాలాజీ ఆవరణలోని షెడ్ల ద్వారా భక్తుల(Devotees)ను అనుమతించి క్యూలైన్లలోకి వెళ్లెలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 10 కౌంటర్లు ఉన్నాయి. అందులో 4 దివ్యదర్శనం, 6 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.

Next Story