తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

by Vemula.Srinu Prasad |

తిరుమల భక్తులకు అలర్ట్ ప్రకటించారు...

తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల భక్తుల(Tirumala Devotees)కు టీటీడీ(TTD) బిగ్ అలర్ట్ ప్రకటించింది. శ్రీవారి దర్శనం 30 గంటల సమయం పడుతోందని తెలిపింది. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో గురువారం తిరుమలకు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోకి భక్తుల అనుమతి నిలిపేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు భక్తులను క్యూ లైన్‌లోకి అనుమతించనున్నామని అధికారులు స్పష్టం చేశారు.

కాగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు సైతం బారులు తారాయని చెప్పారు. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు వాహనదారులు గంటల తరబడి వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. సర్వదర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాలు శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద భక్తులు టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేవలం 8 వేల టోకెన్లు మాత్రమే ఒక రోజుకు విడుదల చేస్తున్నారు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 30 వేల మందికి పైగా భక్తులు సర్వదర్శనం కోసం తరలి వచ్చారు. దీంతో టోకెన్లు పొందిన భక్తులు, లేనివారు వసతి కోసం తీవ్ర పాట్లు పడుతున్నారు.

Next Story