- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. వేసవి సెలవులు ముగిసే క్రమంలో గత నెల రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ వచ్చింది. ఈ తరుణంలో తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ రోజు ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో నేడు(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 76,181 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.88 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.






