Aghori:‘అతని అంతు చూస్తా’.. అఘోరా బాబా ఇంటి ముందు అఘోరీ హల్‌చల్

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-03 09:02:23  IST  )

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో లేడీ అఘోరీ హల్‌చల్ చేసింది.

Aghori:‘అతని అంతు చూస్తా’.. అఘోరా బాబా ఇంటి ముందు అఘోరీ హల్‌చల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో లేడీ అఘోరీ హల్‌చల్ చేసింది. ఆదివారం నెల్లూరు జిల్లా(Nellore District)లోని జాతీయ రహదారిపై లారీ వాహన డ్రైవర్ల పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. చిలకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద ఆవుల లోడుతో వెళుతున్న మూడు లారీలను అడ్డగించిన అఘోరీ(Aghori) హల్‌చల్ సృష్టించింది. ఈ క్రమంలో నేడు(సోమవారం) లేడీ అఘోరీ ఏపీలోని తణుకులో ప్రత్యక్షమైంది. ఈ క్రమంలో అఘోరా బాబా ఇంటి వద్ద అఘోరీ మాత ఆందోళన చేపట్టింది.

అఘోరా బాబా(Aghora Baba)గా పిలవబడుతున్న రాజేష్‌ నాథ్ అంతు చూస్తానని తెలిపింది. అఘోరా ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అఘోరీ ఆరోపించింది. కాగా సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని అతని ఇంటి ముందు భైఠాయించిన అఘోరీ మాత రచ్చ చేసింది. దీంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని అఘోరీని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

అయితే.. అఘోరా బాబాగా చెప్పుకుంటున్న రాజేష్ నాథ్ రాసలీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇద్దరమ్మాయిలతో రాజేష్ నాథ్ చేసిన అసభ్య చాటింగ్ బయటపడింది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి రాజేష్ నాథ్ వద్దకు వెళ్లిన ఓ బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై వీడియో విడుదల చేసింది. అఘోరా పేరుతో రాజేష్ కామవాంఛ తీర్చుకుంటున్నాడని ఆరోపించింది. అతడి చేతిలో ఎవరు మోసపొవద్దని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.

Next Story