Breaking: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-26 16:45:43  IST  )

నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు..

Breaking: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు(Rayachoti Police) అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను అనంతపురం తీసుకెళ్తున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు అయింది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆయన్ను ఏపీకి తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం రాజంపేట అడిషినల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది.


గతంలో పోసాని కృష్ణ మురళి వైసీపీలో పని చేశారు. అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోసానిని తాజాగా అరెస్ట్ చేసి అనంతపురానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సెలైంట్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోసానికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. పోసాని సతీమణీకి అరెస్టు నోటిస్ ఇచ్చారు. అరెస్ట్ సమయంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ గురువారం (27/02/2025) రాత్రి 8.45గా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

కాగా కొద్ది రోజులుగా వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు అవినీతి, బెదిరింపులు, అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పుట్లో కేసులు నమోదు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌‌తో పాటు వల్లభనేని వంశీతో పాటు పలువురు వైసీపీ సోషల్ మీడియా నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story